logo

నీటి విడుదల 40 వేల క్యూసెక్కులకు పెంపు

సోమశిల జలాశయం నుంచి వరద నీటి విడుదలను 40 వేల క్యూసెక్కులకు పెంచారు. పై తట్టు నుంచి వచ్చే వరద ప్రవాహం శనివారం ఉదయం 35041 క్యూసెక్కులకు పెరగ్గా..

Published : 02 Oct 2022 02:03 IST

ఆరు క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదల

ఆత్మకూరు, న్యూస్‌టుడే: సోమశిల జలాశయం నుంచి వరద నీటి విడుదలను 40 వేల క్యూసెక్కులకు పెంచారు. పై తట్టు నుంచి వచ్చే వరద ప్రవాహం శనివారం ఉదయం 35041 క్యూసెక్కులకు పెరగ్గా.. జలాశయంలో నిల్వ 71 టీఎంసీలకు చేరింది. దాంతో ఉన్నతాధికారులు పెన్నాలోకి వరద నీటిని పది వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచారు. 3, 4, 9, 10, 11, 12 నంబరు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. రాత్రి 7 గంటలకు 40వేల క్యూసెక్కులకు పెంచారు. పవర్‌ టన్నెల్‌ ద్వారా 2500, కండలేరు వరద కాలువకు 3000 క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం 4గంటలకు జలాశయంలోకి వచ్చే వరద ప్రవాహం 31,083 క్యూసెక్కులుగా నమోదైంది.

లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం
వరద నీటి  విడుదల పెంపుతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఆత్మకూరు, నెల్లూరు డివిజన్ల పరిధిలోని పెన్నా తీర మండలాలైన అనంతసాగరం, కలువాయి, ఆత్మకూరు, చేజర్ల, సంగం, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు గ్రామీణ ప్రజలకు సూచనలు చేశారు. ఆ మేరకు ఆత్మకూరు ఆర్డీవో కరుణకుమారి ఆదేశాలిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని