logo

వైకాపాకు మద్దతుగా వాట్సాప్‌లో స్టేటస్‌

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వాలంటీరుపై వేటు పడింది. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన శ్రీనివాసులు వాలంటీరుగా పని చేస్తున్నారు. తన చరవాణిలో వైకాపాకు మద్దతుగా వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టారు.

Published : 29 Mar 2024 03:18 IST

కాగితాలపూరు వాలంటీరు తొలగింపు

మనుబోలు, న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వాలంటీరుపై వేటు పడింది. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన శ్రీనివాసులు వాలంటీరుగా పని చేస్తున్నారు. తన చరవాణిలో వైకాపాకు మద్దతుగా వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టారు. దానిపై గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తహసీల్దారు చిరంజీవి విచారణ చేపట్టారు. వాస్తవమని తేలడంతో గురువారం వాలంటీరును తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.


చాకిచర్లలో మరొకరు..

ఉలవపాడు : మండలంలోని చాకిచర్లలో కనిగిరి ఎమ్మెల్యే, కందుకూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్న వాలంటీరు లాజరును విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో విజయ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి కాపాలదారుడిగా పనిచేస్తున్న రవీంద్ర అనే వ్యక్తి కూడా అదే కార్యక్రమంలో భాగస్వామి అయినట్లు గుర్తించిన అధికారులు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని