logo

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: తెదేపా

చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర తెలిపారు.

Published : 17 Apr 2024 03:46 IST

పార్టీలో చేరిన వారితో కృష్ణారెడ్డి, రవిచంద్ర 

దగదర్తి: చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర తెలిపారు. మంగళవారం మండలంలోని ఉలవపాళ్ల తదితర గ్రామాల్లో జరిగిన ప్రచారంలో మాట్లాడారు. ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కృష్ణారెడ్డి, పార్లమెంటు అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. గ్రామంలోని వైకాపాకు చెందిన సల్మాన్‌ ఆధ్వర్యంలో 25 కుటుంబాలు పార్టీలో చేరాయి. కార్యక్రమంలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి కృష్ణారెడ్డి, కోటారెడ్డి, నాయకులు సుబ్బానాయుడు, రవీంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.

కావలి : తమ పార్టీ భాజపాతో పొత్తు పెట్టుకుందే గాని, విలీనం కాలేదని తెదేపా జిల్లా అధ్యక్షులు అబ్ధుల్‌ అజీజ్‌ అన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యం కావడాన్ని వైకాపా విమర్శ చేయడం తగదన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలో ముస్లింలతో నిర్వహించిన తెదేపా ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా వీపీఆర్‌, కావలి ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు.

రాష్ట్ర భవిష్యత్తుకు తెదేపాకు ఓటేయాలి

కందుకూరు పట్టణం :  రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని’ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని వెంగమాంబ కల్యాణమండపంలో నియోజకవర్గ పాస్టర్లతో ఆత్మీయ సమావేశం సోమవారం జరిగింది. కార్యక్రమంలో గోనుగుంటతిమోతి, సీహెచ్‌ బాలసుందరం, డానియేలు, గడ్డంజాన్‌, అభ్రహం, జనార్దన్‌రావు, తెదేపా నాయకులు  పాల్గొన్నారు.

లింగసముద్రం : అరాచక పాలనకు త్వరంలో ముగింపు తప్పదని కందుకూరు తెదేపా ఉమ్మడి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని పెదపవనిలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చెందిన రామిశెట్టి మాలకొండయ్య ఆధ్వర్యంలో వైకాపా నుంచి తెదేపాలోకి భారీ ఎత్తున కార్యకర్తలు చేరారు. కార్యక్రమంలో పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సాంబయ్య, నియోజకవర్గ మైనార్టీ సెల్‌ అధ్యక్షులు నాయబ్‌ రసూల్‌ పాల్గొన్నారు.

వరికుంటపాడు: పార్టీలోకి ఆహ్వానిస్తున్న కాకర్ల

ఉలవపాడు: తెదేపా స్థానిక కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరరావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, శ్రీనివాసరావు, భాజపా, జనసేన నాయకులు పాల్గొన్నారు.

యువతకు ఉపాధి కల్పన

కొండాపురం :  యువతకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ పేర్కొన్నారు. గరిమెనపెంట పంచాయతీ వెంకటరంగాపురంలో మంగళవారం తెదేపా నాయకుడు అల్లి మధు ఆధ్వర్యంలో 200 మంది తెదేపాలో చేరారు. నాయకులు కంభం విజయరామిరెడ్డి, మన్నేటి వెంకటరెడ్డి, మామిళ్లపల్లి ఓంకార్‌, యారవ కృష్ణయ్య, పాల్గొన్నారు.

వరికుంటపాడు:  మండలంలోని గణేశ్వరాపురం, నారసింహాపురం, తూర్పురొంపిదొడ్ల, దక్కనూరు, తూర్పుకొండారెడ్డిపల్లె, తిమ్మారెడ్డిపల్లె, వేంపాడులో మండల కన్వీనర్‌ చండ్రా మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో కాకర్ల సురేష్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

తూర్పురొంపిదొడ్ల ఎస్సీ కాలనీలో సర్పంచి నాగేశ్వరి, వెంగయ్య ఆధ్వర్యంలో వైకాపా ఎస్సీసెల్‌ అధ్యక్షులు కాకి అంకయ్యతోపాటు పలువురు చేరారు.

సమావేశంలో మాట్లాడుతున్న నాగేశ్వరరావు

సీతారామపురం : బీసీలకు తెదేపా పెద్దపీట వేసిందని జిల్లా కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటసుబ్బయ్య తెలిపారు.

వరికుంటపాడు :  మాజీ శాసన సభ్యులు మేకపాటి చంద్రశేఖరరెడ్డి  మండలంలోని పలు గ్రామాలో మండల కన్వీనర్‌ చండ్రా మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, పేరం సుధాకర్‌రెడ్డి,  సర్పంచి ఏనుగు వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు