logo

వేసవి ప్రణాళిక లేదు.. అధికారి లేరు

ఎండలు మండి పోతున్నాయి. జిల్లాలో బావులు, నీటి వనరులు అడుగంటుతున్నాయి. జనం దాహార్తితో అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదిక పనిచేయాల్సిన గ్రామీణ నీటి సరఫరా అధికారులు.. బదిలీపై వెళ్లిపోతున్నారు.

Published : 18 Apr 2024 03:22 IST

ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు ఎస్‌ఈ బదిలీ
ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలో వింత పరిస్థితి

ఆర్‌డబ్ల్యూఎస్‌ జిల్లా కార్యాలయం

ఎండలు మండి పోతున్నాయి. జిల్లాలో బావులు, నీటి వనరులు అడుగంటుతున్నాయి. జనం దాహార్తితో అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదిక పనిచేయాల్సిన గ్రామీణ నీటి సరఫరా అధికారులు.. బదిలీపై వెళ్లిపోతున్నారు. జిల్లాకు రెగ్యులర్‌ ఎస్‌ఈని నియమించకపోగా.. ఉన్న ఇన్‌ఛార్జిని కూడా బదిలీలు చేస్తున్నారు. పక్క జిల్లాకు చెందిన అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించడంపై విమర్శలు వస్తున్నాయి.

న్యూస్‌టుడే, నెల్లూరు,(జడ్పీ): వేసవిలో నీటి ఎద్దడిని సమర్థంగా ఎదుర్కోవాల్సిన గ్రామీణ నీటి సరఫరా యంత్రాంగం.. అయోమయంలో పడిపోయింది. ఆ శాఖ ఇన్‌ఛార్జి ఎస్‌ఈగా ప£నిచేస్తున్న రంగప్రసాద్‌ను రాత్రికి రాత్రే బదిలీ చేశారు. 18 నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందనగా ముందురోజే ఆయన్ని ఇక్కడి నుంచి బదిలీ చేయడం గమనార్హం. ఎన్నికల షెడ[్యూలు విడుదలకు ముందు బదిలీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయి. ఇంతకుముందు నెల కిందటే నెల్లూరు ఇన్‌ఛార్జి ఈఈగా ఉన్న శ్రీనివాసులురెడ్డిని డీఈగా రివర్షన్‌ ఇచ్చి పంపించారు. శాఖాపరంగా రాష్ట్రస్థాయిలో కొందరు తీసుకున్న నిర్ణయాలతో గుంటూరు జోన్‌ పరిధిలో పనిచేసే అధికారులు అయోమయానికి గురవుతున్నారు.

2019 నుంచి తాత్కాలిక అధికారితో సరి..

2019 నుంచి జిల్లాకు రెగ్యులర్‌ ఎస్‌ఈగా ఎవరినీ నియమించలేదని ఆ శాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌ ఎస్‌ఈని నియమించక పోగా.. ఇన్‌ఛార్జిగా ఉన్న అధికారిని వేసవి సమయంలో బదిలీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 37 మండలాలు ఉన్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా ఈ మండలాల పరిధిలో భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. జిల్లాకు వరప్రసాదిని అయిన సోమశిల జలాశయంలో డెడ్‌ స్టోరేజీకి నీరు చేరుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటా వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు, మనుబోలు, కొండాపురం, ఉదయగిరి వంటి మెట్ట ప్రాంత మండలాల్లోని గ్రామాలకు నీటి ఎద్దడి తప్పడం లేదు. ముందుగానే అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపి.. ప్రత్యేక నిధుల కోసం ప్రయత్నిస్తారు. అయినా ఇప్పటివరకు అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. పైగా ఎస్‌ఈని బదిలీ చేశారు. ఒంగోలులో ఉన్న ఎస్‌ఈకి బాధ్యతలు అప్పగించారు. ఇతర జిల్లా ఎస్‌ఈని ఇక్కడ ఇన్‌ఛార్జిగా నియమించడంపై చర్చ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు