logo

అమ్మాయిలను చదవనిద్దాం

ప్రతి అమ్మాయి చదువుకునేలా చూసి.. భవిష్యత్తులో వారు ఎదిగేలా అవకాశాలు కల్పిద్దామని మహిళా కమిషన్‌ సభ్యురాలు సుదాం లక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారిణి ఝాన్సీలక్ష్మి అన్నారు. సోమవారం జాతీయ

Published : 25 Jan 2022 03:12 IST

మాట్లాడుతున్న సుదాం లక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారిణి ఝాన్సీలక్ష్మి

నిజామాబాద్‌ విద్యావిభాగం : ప్రతి అమ్మాయి చదువుకునేలా చూసి.. భవిష్యత్తులో వారు ఎదిగేలా అవకాశాలు కల్పిద్దామని మహిళా కమిషన్‌ సభ్యురాలు సుదాం లక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారిణి ఝాన్సీలక్ష్మి అన్నారు. సోమవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం బాలికలను బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దామనే అంశాలపై జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు అరికట్టడానికి ప్రభుత్వాలు వయోపరిమితి పెంచాయని గుర్తు చేశారు. ఆడపిల్లల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయన్నారు. బేటీ బచావో.. బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సఖీ కేంద్రం లీగల్‌ అడ్వైజర్‌ లావణ్య, సూపరింటెండెంట్‌ ఇందిరా, జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి స్వప్న, మహిళాశక్తి కేంద్రం జిల్లా సమన్వయకర్త జ్యోత్స్న పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని