logo

నాసిరకం మాంసం విక్రయాలు!

బాన్సువాడ పట్టణంలోని మటన్‌ మార్కెట్‌కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు.

Updated : 26 Apr 2024 06:15 IST

మటన్‌ మార్కెట్‌లో కలకలం

న్యూస్‌టుడే, బాన్సువాడ పట్టణం : బాన్సువాడ పట్టణంలోని మటన్‌ మార్కెట్‌కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. మేక మెడకు గాయాలు ఉండటంతో గమనించిన పలువురు బల్దియాకు సమాచారం అందించారు. దీంతో కమిషనర్‌ తనిఖీలు చేపట్టారు. విక్రయిస్తున్న మాంసం నాసిరకంగా ఉందని, దానిని వ్యాపారి నుంచి స్వాధీనం చేసుకొన్నారు.

పర్యవేక్షణ లోపం..

ప్రతి రోజూ మున్సిపల్‌ అధికారులు తనిఖీలు చేపట్టాలి. వారు ధ్రువీకరిస్తేనే మేకను కోయాల్సి ఉంటుంది. ఇలా నిబంధనలు ఉన్నా ఇక్కడ అటువంటివి జరగకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యత లేని, రోగాల బారినపడిన వాటిని విక్రయిస్తున్నారు. పశువైద్యశాల అధికారులు సైతం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై వారిని సంప్రదిస్తే పుర అధికారులే చూస్తున్నారని చెప్పారు.

‘నాసిరకం మాంసం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు. ప్రత్యేక తనిఖీలు చేపడుతాం. మాంసాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు నాణ్యత ధ్రువీకరణ కోసం పంపనున్నాం. మేకను ఖననం చేశాం. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై పోలీసులను సంప్రదించి కేసులు నమోదు చేస్తాం. ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం విక్రయాలు జరపాలి’ అని బాన్సువాడ బల్దియా కమిషనర్‌ అలీం తెలిపారు.

గడువు ఐదు రోజులే : కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాకేంద్రంలో 5 శాతం రాయితీపై ఆస్తి పన్ను చెల్లించేందుకు గడువు ఐదు రోజులే మిగిలి ఉంది. ఇప్పటివరకు రూ.20 లక్షల మేర పన్ను సమకూరింది. గతేడాది ఈపాటికి రెట్టింపు మేర పన్ను సమకూరింది. ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించి బల్దియాకు ఆదాయం సమకూర్చేందుకు తోడ్పాటును అందించాలని కమిషనర్‌ సుజాత కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని