logo

పురాతన బావిని పరిశీలించిన కేంద్ర జలశక్తి అభియాన్‌ అధికారులు

లింగంపేట మండలం కేంద్రంలోని అతి పురాతనమైన ఎంతో చరిత్ర కలిగిన నాగన్న దిగుడు బావిని బుధవారం కేంద్ర జలశక్తి అభియాన్‌ అధికారులు రిజ్విన్‌, సీబీ సింగ్‌లు, డీఆర్డీఏ పీడీ సాయన్న, జిల్లా రూరల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి సతీష్‌తో కలిసి పరిశీలించారు.

Updated : 30 Nov 2022 13:34 IST

లింగంపేట : లింగంపేట మండలం కేంద్రంలోని అతి పురాతనమైన ఎంతో చరిత్ర కలిగిన నాగన్న దిగుడు బావిని బుధవారం కేంద్ర జలశక్తి అభియాన్‌ అధికారులు రిజ్విన్‌, సీబీ సింగ్‌లు, డీఆర్డీఏ పీడీ సాయన్న, జిల్లా రూరల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి సతీష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బావి కట్టడం చూసి ఆశ్చర్యం కలిగించిందన్నారు. దీన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రదేశంగా మార్చవచ్చని అభిప్రాయపడ్డారు. వారి వెంట ఎంపీడీవో నారాయణ, సొసైటీ ఛైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, యువ యూత్‌ అధ్యక్షుడు బొల్లి శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని