logo

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు

Published : 30 Apr 2024 05:49 IST

అంకాపూర్‌లో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి
ఆర్మూర్‌ గ్రామీణం, నందిపేట్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అంకాపూర్‌లో ఆర్మూర్‌, ఆలూర్‌ మండలాల కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆర్మూర్‌ నియోజకవర్గ బాధ్యుడు వినయ్‌కుమార్‌రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. కార్యకర్తలు ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలకు కాంగ్రెస్‌ పథకాలు వివరించి గెలిపించాలని అన్నారు. గల్ఫ్‌ బోర్డు ఏర్పాటుతో పాటు అక్కడ మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. పిల్లలకు గురుకులాల్లో విద్య అందిస్తామని చెప్పారు. నందిపేట్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. లక్కంపల్లి సెజ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిశ్రమల కోసం వందల ఎకరాలు సేకరిస్తే గత పాలకులు తుంగలో తొక్కారనివిమర్శించారు. తాను నలుగురికి అన్నం పెట్టినోడినని ఆహార పరిశ్రమలు తెప్పించలేనా అని వ్యాఖ్యానించారు. ‘నేను మీరనుకున్న జీవన్‌రెడ్డిని కానమ్మా.. ప్రజల కష్టసుఖాలు తెలిసిన జీవన్‌రెడ్డినమ్మా’.. అంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుకుంటున్నారేమో కానీ నేను అసలు సిసలు ప్రజల మనిషినంటూ అన్నారు. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్‌రెడ్డి, జిల్లా, మండలాధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, మంద మహిపాల్‌, సిలిండర్‌ లింగం, తాహెర్‌, ఖలీం, నాయకులు మార గంగారెడ్డి, మార చంద్రమోహన్‌, జీవన్‌, ఎంపీపీ పస్క నర్సయ్య, సాయారెడ్డి, విజయ్‌, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని