logo

ఉక్కపోత.. రోగులకు వెత

వేసవి తీవ్రరూపం దాల్చింది. 43 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతుతోంది. జిల్లా ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 అయిందంటే చాలు తీవ్రమైన ఉక్కపోత రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Published : 30 Apr 2024 05:56 IST

క్రామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి విభాగంలో మహిళలు
కామారెడ్డి వైద్యవిభాగం-న్యూస్‌టుడే: వేసవి తీవ్రరూపం దాల్చింది. 43 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతుతోంది. జిల్లా ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 అయిందంటే చాలు తీవ్రమైన ఉక్కపోత రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రసూతి అయిన మహిళలు, నవజాతశిశువుల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉంది. ఆయా విభాగాల్లో సరిపడా ఏసీలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. బాలింతలు చికిత్సపొందే వార్డులతో పాటు సాధారణ చికిత్స విభాగంలో రోగుల బాధ వర్ణణాతీతం. అధునాతన విభాగాల్లో, కొత్త వార్డుల్లో ఏసీలు ఏర్పాటు జరిగినా పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదు.

 తరచూ దెబ్బతింటూ..

 ఆయా విభాగాల్లో ఏసీలు తరచూ పాడవుతున్నాయి. ఎలుకలు ఏసీల్లోకి వెళ్లి తీగలను కొరికేస్తున్నాయి. గతంలో ఎలుకల కారణంగా 12 ఏసీలు పాడయ్యాయి. మరమ్మతుల్లో తీవ్ర జాప్యం కారణంగా చాలా రోజుల వరకు రోగులు ఉక్కపోతతో సతమతమయ్యారు. తాజాగా ఎండ తీవ్రత నేపథ్యంలో చికిత్స పొందే గదుల్లో ఉండటానికి రోగులు అసౌకర్యానికి గురవుతున్నారు.

యంత్రాంగం స్పందిస్తేనే

వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రధాన విభాగాల్లో ఏసీలు ఏ మేరకు అవసరమో ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదించాల్సిన అవసరం ఉంది. మే మొదటి వారంలో 20 ఏసీలు మంజూరైతే ఉక్కపోత బాధ నుంచి ఉపశమనం కానుంది. కాగా రోగుల ఇబ్బందులను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు చెబుతున్నారు. త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని