logo

14 కిలోల కణితి తొలగింపు

కొరాపుట్‌లో షాహిద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం జరిగిన శస్త్రచికిత్సలో ఓ మహిళ పొట్టలో 14 కిలోల కణితిని తొలగించారు

Published : 19 Aug 2022 03:25 IST

తొలగించిన కణితిని చూపిస్తున్న వైద్యులు

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్‌లో షాహిద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం జరిగిన శస్త్రచికిత్సలో ఓ మహిళ పొట్టలో 14 కిలోల కణితిని తొలగించారు. డా.గోపాల్‌ నాయక్‌ నేతృత్వంలో, సర్జన్‌ డా.బాసుదేవ్‌ మరాండి, నర్సుల సహకారంతో దాదాపు గంటన్నర పాటు శస్త్రచికిత్స జరిగింది. రాయగడ జిల్లా, కాశీపూర్‌ సమితిలోని గుల్మిజోలా గ్రామానికి చెందిన సత్యబతి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిందని, ప్రసూతి, గైనకాలజీ విభాగం డా.జగదీశ్చంద్ర బెహరా పరీక్షలు చేయగా అండాశయంలో కణితి పెరుగుతున్నట్లు గుర్తించి, తొలగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు