logo

పుండ్లు శుభ్రం చేసి.. ఔషధం రాసి

పట్టణ జపాటాపూర్‌ ప్రాంతంలోని హనుమాన్‌ మందిర్‌ సేవా సమితి మరోసారి పెద్ద మనసు చాటుకుంది. శుక్రవారం సంస్థ ప్రతినిధి అశీమ్‌ చటర్జీ నేతృత్వంలో నింపురాలోని కుష్ఠు రోగుల కాలనీ నుంచి 150 మంది ప్రత్యేక వాహనంలో పట్టణానికి తీసుకొచ్చారు.

Published : 28 Jan 2023 02:04 IST

పుండ్లు శుభ్రం చేసి కట్టు కడుతున్న సంస్థ ప్రతినిధి

ఖరగ్‌పూర్‌, న్యూస్‌టుడే: పట్టణ జపాటాపూర్‌ ప్రాంతంలోని హనుమాన్‌ మందిర్‌ సేవా సమితి మరోసారి పెద్ద మనసు చాటుకుంది. శుక్రవారం సంస్థ ప్రతినిధి అశీమ్‌ చటర్జీ నేతృత్వంలో నింపురాలోని కుష్ఠు రోగుల కాలనీ నుంచి 150 మంది ప్రత్యేక వాహనంలో పట్టణానికి తీసుకొచ్చారు. అనంతరం అల్పాహారాలు అందజేశారు. ఆపై రోగుల పుండ్లు శుభ్రం చేసి, ఔషధాలు రాసి కట్టు కట్టారు. ముగ్గురికి ట్రై సైకిళ్లతో పాటు, అందరికీ కంబళ్లు పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి మళ్లీ ప్రత్యేక వాహనంలో సురక్షితంగా వాళ్ల ఇళ్లకు చేర్చారు. ఈ కార్యక్రమానికి ప్రబీర్‌ గంగూలీ, మాజీ పురాధ్యక్షుడు రవిశంకర్‌ పాండే, వివేకానంద్‌ దాస్‌ చౌదరి, సోబన్‌ ఆచార్య, పోలూ దాసు గుప్తా, రంజిత్‌ బాదుడియా ఇతరులు అతిథులుగా హాజరై నిర్వాహకులను ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని