logo

అబ్కారీ గోదాంలో మంటలు

కటక్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం ఈ ఘటన జరగడంతో ప్రాణనష్టం జరగలేదు.

Published : 01 Feb 2023 03:43 IST

అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మేయర్‌ సుభాష్‌ సింగ్‌ తదితరులు

కటక్‌, న్యూస్‌టుడే: కటక్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం ఈ ఘటన జరగడంతో ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం పక్కన ఉన్న అబ్కారీ శాఖ గోదాం ఉంది. దాడుల్లో దొరికిన మద్యం, నాటుసారా, గంజాయి, స్పిరిట్‌ ఇందులో ఉంచుతారు. గోదాంకు ఆనుకుని ఉన్న చిన్న హోటల్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో అగ్ని గోదాంకు వ్యాపించింది. స్పిరిట్‌, మద్యం ఉండడంతో మంటలు తీవ్రంగా ఎగిసి పడ్డాయి. దీంతో చుట్టుపక్కల నివాసితులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఉదయం 10 గంటల తర్వాత సమీపంలోని సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయానికి వందలాదిమంది వస్తుంటారు. ప్రమాదం ఏడు గంటలకు జరగడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న కటక్‌ మేయర్‌ ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సమీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని