logo

విద్యుత్తు వినియోగదారులకు శుభవార్త

విద్యుత్తు వినియోగదారులకు శుభవార్త. 2023-24లో రాష్ట్రంలో ఛార్జీలు పెరగవు. ఒడిశా ఎలక్ట్రికల్‌ రెగ్యులేటరీ కమిషన్‌ (ఓఈఆర్‌సీ) ఈమేరకు గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది.

Published : 24 Mar 2023 01:53 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారులకు శుభవార్త. 2023-24లో రాష్ట్రంలో ఛార్జీలు పెరగవు. ఒడిశా ఎలక్ట్రికల్‌ రెగ్యులేటరీ కమిషన్‌ (ఓఈఆర్‌సీ) ఈమేరకు గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. మునుపటి ఛార్జీలే అమల్లో ఉంటాయి. సాగు అవసరాలకు వినియోగించే విద్యు త్తుకు రాయితీ ఉంటుంది. గ్రామీణ వినియోగదారులకు యూనిట్‌పై 10 పైసలు రాయితీ ఇచ్చారు. శీతల గిడ్డంగులకు యూనిట్‌ ఛార్జీ రూ.1.60లుగా నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 యూనిట్ల వరకు వినియోగిస్తే యూనిట్‌ ఛార్జీ రూ.3లు కాగా, 50 నుంచి 200 వరకు రూ.4.80లు, 200 నుంచి 400 వరకు రూ.5.80లు, 400 దాటితే రూ.6.20లుగా ఉంది. ఈ వివరాలు విలేకరులకు తెలియజేసిన ఓఈఆర్‌సీ కార్యదర్శి ప్రియబ్రత పట్నాయక్‌ విద్యుత్తు బిల్లులు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించేవారికి ఇది వరకు 3 శాతం రాయితీ ఉండేదని, ఇప్పుడు దీనిని 4 శాతానికి పెంచామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని