logo

వారధి కట్టి.. ఓటు అడగండి

వారధి కట్టి ఓట్లు అడగాలని కంజసరి గ్రామస్థులు అంటున్నారు. బిసంకటక్‌ నియోజకవర్గం కల్యాణ్‌ సింగుపూర్‌ సమితి సింగారి పంచాయతీలోని కంజసరి గ్రామం నాగావళి నదికి అవతల ఉంది.

Published : 17 Apr 2024 05:36 IST

కర్ర వంతెనపై రాకపోకలు చేస్తున్న గ్రామస్థులు

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: వారధి కట్టి ఓట్లు అడగాలని కంజసరి గ్రామస్థులు అంటున్నారు. బిసంకటక్‌ నియోజకవర్గం కల్యాణ్‌ సింగుపూర్‌ సమితి సింగారి పంచాయతీలోని కంజసరి గ్రామం నాగావళి నదికి అవతల ఉంది. గ్రామస్థులు ఏదైనా అవసరం నిమిత్తం నది దాటవలసిన పరిస్థితి. అందుకోసం వేసవి సమయంలో కర్రలతో వంతెన నిర్మించుకుని పంచాయతీకి రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలంలో నదిలో నీటి ప్రవాహం పెరిగి వంతెన విరిగిపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ వేసవిలోనే వంతెన నిర్మాణం చేసుకుంటారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గత పదేళ్లుగా ఈ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి నాయకులు వస్తారు తప్ప తమ సమస్య ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. పలుమార్లు సమితి సమావేశంలో ప్రస్తావించినా ఫలితం లేకపోవడంతో వారధి నిర్మిస్తేనే ఓట్లు వేస్తామని, లేని పక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు