logo

నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

కోటదుర్గమ్మ దేవస్థానంలో సోమవారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరిపేందుకు సర్వం సిద్ధం చేశారు. ప్రతి రోజూ రాత్రివేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

Published : 26 Sep 2022 03:34 IST

నిజరూప దర్శనంలో అమ్మవారు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: కోటదుర్గమ్మ దేవస్థానంలో సోమవారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరిపేందుకు సర్వం సిద్ధం చేశారు. ప్రతి రోజూ రాత్రివేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
భారీ బందోబస్తు.. నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డీఎసీˆ్ప ఎం.శ్రావణి ఆధ్వర్వంలో 200 మందితో భద్రత కల్పించనున్నారు. సీˆఐ కె.మురళీధర్‌తోపాటు ఎనిమిది మంది ఎస్సైలు, 22 మంది ఏఎస్సై, హెచ్‌సీలు, 53 మంది కానిస్టేబుళ్లు, 35 మంది హోంగార్డులు ఉత్సవ బందోబస్తులో విధులు నిర్వహించనున్నారు. దీంతోపాటు మూడు ప్రత్యేక పోలీసు బృందాలు రానున్నాయి.

రాటతో ఆరంభం
దసరా శరన్నవరాత్రులకు ప్రారంభం రోజున రాటతో అమ్మవారి ఉత్సవాలను ప్రారంభిస్తారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి నిజరూప దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు  ఉంటుంది. మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం,  ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగానే  తరలివస్తారు.

సాంస్కృతిక కార్యక్రమాలకు సిద్ధం చేస్తున్న వేదిక

షామియానాలు.. అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి దేవదాయశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన రహదారిలోని సచివాలయం పక్క నుంచి దర్శనాలకు వీలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉచిత, ప్రత్యేక, వీఐపీలకు వేర్వేరుగా దర్శనాలు చేసుకునే వీలు కల్పించారు. ఎండల నుంచి రక్షణ పొందేందుకు షామియానాలు సిద్ధం చేశారు.

ట్రాఫిక్‌ మళ్లింపు.. ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రాజాం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను అన్నవరం మీదుగా పట్టణంలోనికి అనుమతిస్తారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.
హంసవాహన రథం సిద్ధం
సాలూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని శివాలయం, కామాక్షి అమ్మవారు, వాసవి కన్యకా పరమేశ్వరి, జ్ఞాన సరస్వతిదేవి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలకు అంతా సిద్ధం చేశారు. శివాలయం వద్ద పుష్కరిణిలో అమ్మవారికి తెప్పోత్సవం, రథోత్సవం నిర్వహించేందుకు హంసవాహనం, రథం అలంకరించారు. ఆటోటాక్సీ స్టాండులో మోటారు కార్మికులు దేవీ నవరాత్రి ఉత్సవాలకు మండపాన్ని సిద్ధం చేశారు. దసరా పండగ శోభ పట్టణంలో ఉట్టిపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు