logo

ఇంటర్‌ మూల్యాంకనం 50 శాతం పూర్తి

కొత్తగా ఏర్పడిన జిల్లాలో తొలిసారిగా ఇంటర్మీడియట్‌ మూల్యాంకనం నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 50 శాతం దాటి జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు క్యాంపు అధికారి ఎస్‌.తవిటినాయుడు తెలిపారు.

Published : 28 Mar 2024 04:04 IST

అధ్యాపకులకు సూచనలు చేస్తున్న తవిటినాయుడు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: కొత్తగా ఏర్పడిన జిల్లాలో తొలిసారిగా ఇంటర్మీడియట్‌ మూల్యాంకనం నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 50 శాతం దాటి జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు క్యాంపు అధికారి ఎస్‌.తవిటినాయుడు తెలిపారు. బుధవారం అధ్యాపకులతో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు అందించారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చిత్తశుద్ధితో బోర్డు ఆదేశాలు, నిబంధనలకు లోబడి మూల్యాంకనం చేయాలని సూచించారు. అనంతరం ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. జిల్లాలో మూల్యాంకనం కోసం 70,408 జవాబు పత్రాలు రాగా సుమారు 39 వేల వరకు మూల్యాంకనం జరిపినట్లు వివరించారు. వచ్చే నెల రెండో వారంలో ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ జె.రామారావు, ఏసీ జోనల్‌ అధికారి పి.శంకరరావు, చీఫ్‌ కోడింగ్‌ అధికారి నాగేశ్వరరావు, స్కానింగ్‌ ఇన్‌ఛార్జిగా ఎ.రాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని