logo

వద్దంటే వద్దు..

ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవసరమైన స్లిప్పులను తీసుకునేందుకు భోజరాజపురం గ్రామస్థులు నిరాకరించారు.

Published : 10 May 2024 02:46 IST

ఓటు స్లిప్పులు తీసుకోవడానికి నిరాకరణ

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవసరమైన స్లిప్పులను తీసుకునేందుకు భోజరాజపురం గ్రామస్థులు నిరాకరించారు. గురువారం బీఎల్వో గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటు స్లిప్పులు పంపిణీ చేసేందుకు ప్రయత్నించగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో ఏ ఒక్కరూ చీటీలు తీసుకునేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని బీఎల్వో సంబంధిత అధికారులకు తెలియజేయగా గజపతినగరం రిటర్నింగ్‌ అధికారిణి సూర్యకళ గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చినా గ్రామస్థులు ససేమిరా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చీటీలు తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. తరతరాలుగా మా గ్రామస్థులంతా రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, కనీసం వీధి దీపాలు, సిమెంటు కాలువలు, రహదారులు లేక అవస్థలు పడుతున్నామని మొర పెట్టుకున్నారు. ఆర్వో మాటను కూడా స్థానికులు వినకపోవడంతో ఆమె వెనుదిరిగారు. ఎంపీడీవో చంద్రకుమారి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని