logo

గ్రామస్థాయిలో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక : కలెక్టర్‌

వచ్చే అయిదేళ్లలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టబోయే పనులకు సంబంధించి గ్రామస్థాయిలో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. ఉపాధి హామీ అనుసంధాన పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో ప్రకాశం భవన్‌లో గురువారం

Published : 20 May 2022 02:02 IST


అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వచ్చే అయిదేళ్లలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టబోయే పనులకు సంబంధించి గ్రామస్థాయిలో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. ఉపాధి హామీ అనుసంధాన పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో ప్రకాశం భవన్‌లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉపాధి హామీ నిధులను గ్రామాల అభివృద్ధికి సమర్థంగా వినియోగించడంపై దృష్టి సారించాలన్నారు. స్థానిక అవసరాలను తెలుసుకుని వచ్చే అయిదేళ్లలో శాఖల వారీగా ఆయా పనులు చేపట్టేందుకు తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని దిశా నిర్దేశం చేశారు. అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా వచ్చే అయిదేళ్లలో కూలీలకు కలిగే ప్రయోజనాన్ని వివరించాలన్నారు. పనుల నాణ్యత  విషయంలో రాజీ పడరాదన్నారు. సమావేశంలో డ్వామా పీడీ శీనారెడ్డి, డీపీవో నారాయణరెడ్డి, జడ్పీ సీఈవో జాలిరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మర్దన్‌అలీ, పశుసంవర్థకశాఖ అధికారిణి బేబిరాణి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని