logo

పనుల్లో పురోగతి లేకుంటే చర్యలు

పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భవనాల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలి... లేకుంటే సదరు గుత్తేదారు, ఏఈలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ హెచ్చరించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై ప్రకాశం

Published : 22 May 2022 03:06 IST


అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భవనాల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలి... లేకుంటే సదరు గుత్తేదారు, ఏఈలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ హెచ్చరించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై ప్రకాశం భవన్‌లోని ఛాంబర్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గుత్తేదారులు స్పందించకపోతే నోటీసులు జారీ చేసి ఏజెన్సీలను మార్చాలని స్పష్టం చేశారు. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలకు హై టెన్షన్‌ విద్యుత్తు తీగలు అవరోధంగా ఉన్నట్లు కొన్ని చోట్ల లబ్ధిదారులు తమ దృష్టికి తెచ్చారన్నారు. శ్మశానాల సమీపంలోని లేఅవుట్‌ల చుట్టూ ప్రహరీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. నిర్మాణ పనులకు నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణశాఖ అధికారి పేరయ్య, పీఆర్‌ ఎస్‌ఈ కొండయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మర్దన్‌అలీ, విద్యుత్తు ఎస్‌ఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భూ సేకరణ కేసులపై దృష్టి...
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రహదారులు, రైల్వే ప్రాజెక్ట్‌ల భూసేకరణ ప్రక్రియలో పెండింగ్‌ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ పూర్తయిన చోట పరిహారం చెల్లింపు వేగవంతం చేయాలని ఆదేశించారు. భూ హక్కును క్లెయిమ్‌ చేసుకునే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తితే... వారితో చర్చించి పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ విషయంలో స్పష్టత కోసం ప్రిన్సిపల్‌ కార్యదర్శికి లేఖ రాయాలని సూచించారు. 216, 565, 544 (డి) నంబరు రహదారుల భూ సేకరణపై సమీక్షించారు. సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్, డీఆర్వో పులి శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు లక్ష్మీశివజ్యోతి, కిడారి సందీప్‌కుమార్‌ పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని