logo

మహానాడులో మార్కాపురం జిల్లా తీర్మానం!

వెనుకబడిన మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేసేందుకు తెదేపా మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టేలా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తానని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ తెలిపారు. నియోజకవర్గ స్థాయి మహానాడు సన్నాహక సమావేశం

Published : 24 May 2022 02:20 IST

మాట్లాడుతున్న మెహనకృష్ణ, చిత్రంలో స్థానిక తెదేపా నాయకులు

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: వెనుకబడిన మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేసేందుకు తెదేపా మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టేలా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తానని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ తెలిపారు. నియోజకవర్గ స్థాయి మహానాడు సన్నాహక సమావేశం పట్టణంలోని పాండురంగ స్వామి కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో యాభై రోజుల పాటు ప్రత్యేక జిల్లా కోసం ధర్నాలు, ర్యాలీ, రాస్తారోకోలు చేసినా... ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వెలిగొండ నుంచి నీళ్లిస్తామని ప్రగల్భాలు పలికి... నేటికీ ప్రాజెక్టును కొలిక్కి తేలేదని ధ్వజమెత్తారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలు పరిధి మండువవారిపాలెంలో నిర్వహించనున్న మహానాడును జయప్రదం చేయాలని కోరారు. అందుకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సత్యనారాయణ, అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, ఉపాధ్యక్షుడు కె.కాశయ్య, నాయకులు కె.రామిరెడ్డి, వి.మల్లికార్జున్‌, ఎస్‌కె.మౌలాలి, జె.రామాంజులరెడ్డి, కె.బాలవెంకటరమణ, కొప్పుల శ్రీనివాసులు, పి.గోపీనాథ్‌, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని