logo

పోలీసుల అదుపులో రవితేజ హత్య కేసు నిందితులు!

లారీతో ఢీకొట్టి పసుపులేటి రవితేజను హత్య చేసిన ప్రధాన నిందితులను సోమవారం వేకువ జామున పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండో వైస్‌ ఎంపీపీ ఎన్నిక సమయంలో వైకాపాలోని ఇరువర్గాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా... పదహారో నంబరు

Published : 27 Sep 2022 02:08 IST

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: లారీతో ఢీకొట్టి పసుపులేటి రవితేజను హత్య చేసిన ప్రధాన నిందితులను సోమవారం వేకువ జామున పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండో వైస్‌ ఎంపీపీ ఎన్నిక సమయంలో వైకాపాలోని ఇరువర్గాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా... పదహారో నంబరు జాతీయ రహదారిపై కనుమళ్ల సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులను పట్టుకునేందుకు... ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ప్రత్యేక పోలీసు బృందాలతో వివిధ ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారిస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో వారిని న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. హత్య జరిగిన మరుసటి రోజు... స్థానిక పోలీసు స్టేషన్‌ ఆవరణలో హత్యకు వినియోగించిన లారీని తగులబెట్టిన వారు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులను గుర్తించి తగిన చర్యలు చేపడతామని పోలీసు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని