logo

క్షేత్ర సహాయకుడిని విధుల్లోకి తీసుకోవడంపై విచారణ

గతంలో అవకతవకలు రుజువై సస్పెండైన ఉపాధిహామీ క్షేత్రసహాయకుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై... గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 02 Oct 2022 04:37 IST

బహిరంగ విచారణలో వివరాలు సేకరిస్తున్న ఏపీడీ సుజాత

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: గతంలో అవకతవకలు రుజువై సస్పెండైన ఉపాధిహామీ క్షేత్రసహాయకుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై... గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. నందనవనం పంచాయతీ మంగంపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ క్షేత్రసహాయకుడు మారంరెడ్డి వెంకటేశ్వరరెడ్డిపై పలు ఆరోపణలు రావడంతో... జులై 27న అధికారులు విచారణ జరిపారు. అవి నిజమని తేలడంతో ఆగస్టులో సస్పెండ్‌ చేశారు. సెప్టెంబర్‌లో మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలివ్వడంతో గ్రామస్థులు అభ్యంతరం తెలుపుతూ గత నెల 29న జిల్లా కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డ్వామా పీడీ ఆదేశాల మేరకు ఏపీడీ సుజాత... స్థానిక సచివాలయంలో శనివారం బహిరంగ విచారణ చేపట్టారు. క్షేత్రసహాయకుడు స్థానికంగా లేని తన కుటుంబీకుల పేర్లతో... 2014 నుంచి మస్తర్లు వేస్తూ రూ.లక్షల నిధులు స్వాహా చేశారని పలువురు తెలిపారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌ కింద మొక్కలు నాటిన కూలీలకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని... వేరే హేబిటేషన్‌ నుంచి తనకు అనుకూలమైన వారిని మేట్‌లుగా నియమించుకుని నిధుల స్వాహా చేశారని వివరించారు. క్షేత్రసహాయకుడు వెంకటేశ్వరరెడ్డి విచారణకు హాజరు కాలేదు. వైకాపా నాయకుల అండదండలతోనే ఆయన తిరిగి పోస్టింగ్‌ తెచ్చుకున్నారని... అవకతవకలకు పాల్పడ్డ ఆయనను విధుల నుంచి తొలగించే వరకు ఉద్యమిస్తామని ఎమ్మార్పీఎస్‌ నాయకులు రవికుమార్‌, పెద్దకోటయ్య పేర్కొన్నారు. విచారణ నివేదికను కలెక్టర్‌, డ్వామా పీడీకి అందజేస్తామని ఏపీడీ తెలిపారు. సర్పంచి కృపారావు, ఎంపీటీసీ సభ్యుడు నారాయణస్వామి, ఏపీవో వెంకటేశ్వర్లు, క్లస్టర్‌ టీఏ రత్నబాబు, స్థానికులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని