logo

నకిలీ పత్రాలతో భూదందా

పూర్వీకుల నుంచి తమ ఆధీనంలో ఉన్న భూములు.. గడ్డివాములు ఏర్పాటు చేసుకునే స్థలాలను ఓ వైకాపా నాయకుడు దొంగ పత్రాలు సృష్టించి తమవంటూ దౌర్జన్యం చేస్తున్నాడని రైతులు వాపోయారు.

Published : 26 Jan 2023 02:56 IST

చెన్నరాయునిపల్లె గ్రామస్థుల నిరసన

ఉప కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న చెన్నరాయునిపల్లె గ్రామస్థులు

మార్కాపురం, న్యూస్‌టుడే: పూర్వీకుల నుంచి తమ ఆధీనంలో ఉన్న భూములు.. గడ్డివాములు ఏర్పాటు చేసుకునే స్థలాలను ఓ వైకాపా నాయకుడు దొంగ పత్రాలు సృష్టించి తమవంటూ దౌర్జన్యం చేస్తున్నాడని రైతులు వాపోయారు. మార్కాపురంలోని చెన్నరాయునిపల్లెకు చెందిన వారంతా బుధవారం ఉప కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆక్రమణదారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోగులదిన్నె గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు నకిలీ పట్టా సృష్టించి పేదల భూమిని ఆక్రమించుకుంటున్నాడన్నారు. గ్రామంలో సుమారు 80 ఏళ్ల నుంచి ఉన్న 2.70 ఎకరాల భూమికి నకిలీ పట్టాలు, రికార్డులను సృష్టించి కాజేసే యత్నం చేస్తున్నాడన్నారు. రాత్రికి రాత్రే కంచెలు కూడా ఏర్పాటుచేసి వైకాపా నేత పేరు చెప్పి బెదిరిస్తున్నారన్నారు. తాము కూడా ఆ పార్టీకి చెందిన వారమేనని.. అవసరమైతే తహసీల్దారు, ఉప కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం ఉప కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గుమ్మా నాగయ్య, అడక పోలయ్య, గుమ్మా శ్రీను, బుర్రి రామయ్య, వెంకటేశ్వర్లు, భూషయ్య, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని