logo

అంతరాయాలు లేని విద్యుత్తే లక్ష్యం

వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్తును అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మజనార్దన్‌రెడ్డి అన్నారు.

Published : 03 Feb 2023 02:05 IST

సీఎండీ పద్మ జనార్దన్‌రెడ్డి

వినియోగదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న సీఎండీ, అధికారులు

దర్శి, న్యూస్‌టుడే: వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్తును అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మజనార్దన్‌రెడ్డి అన్నారు. వినియోగదారుల సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించేందుకు గురువారం దర్శి పీజీఎన్‌ కాంప్లెక్స్‌లో ‘ముఖాముఖి’ నిర్వహించారు. రాష్ట్రంలోని విద్యుత్తు సర్కిల్‌ పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 20 అర్జీలు వచ్చాయి. వీటిలో అధికశాతం బిల్లుల సమస్యలు, పరివర్తకాల ఏర్పాటు వంటివి ఉన్నాయి. ముండ్లమూరు మండలం నుంచి కొత్త సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు అర్జీ రాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పొదిలి రోడ్డులోని ఉప కేంద్రాన్ని సీఎండీ పరిశీలించారు. ఆ స్థలం కబ్జాకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చుట్టూ ప్రహరీ ఏర్పాటుతో పాటు డివిజన్‌ కార్యాలయానికి భవనం మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఈ కేవీజీ సత్యనారాయణ, ఈఈలు కరీం, ఎ.సత్యనారాయణ, ఒంగోలు ఎస్‌ఎవో సుబ్బారావు, డీఈఈ పిచ్చయ్య, డివిజన్‌ పరిధిలోని ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని