logo

హవ్వ.. ఆటవిడుపునకూ తాళం...

పాఠాలు, పుస్తకాలంటూ అలసిసొలసే విద్యార్థులు.. హాయిగా ఆటలు ఆడుకునేందుకు సెలవు రోజులను ఎంచుకుంటుంటారు.

Published : 06 Feb 2023 01:51 IST

పాఠాలు, పుస్తకాలంటూ అలసిసొలసే విద్యార్థులు.. హాయిగా ఆటలు ఆడుకునేందుకు సెలవు రోజులను ఎంచుకుంటుంటారు. సమీపంలోని ఉద్యాన వనాలకు వెళ్లి జారుడు బల్లపై జారొచ్చని, ఊయలపై ఊగొచ్చని, అందుబాటులో ఉండే పరికరాలతో ఆటలాడొచ్చని ఆశిస్తారు. తల్లిదండ్రులు కూడా తమ చిన్నారుల కోరికకు అడ్డు చెప్పరు. కొందరైతే తామే దగ్గరుండి తీసుకెళ్తారు. అయితే కనిగిరిలో ఆదివారం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆడుకునేందుకు ఉత్సాహంగా వెళ్లిన విద్యార్థులు, వారి వెంటనున్న తల్లిదండ్రులకు పట్టణంలోని పీవీఆర్‌ ఉద్యాన వనానికి వేసి ఉన్న తాళాలు వెక్కిరిస్తూ కనిపించాయి. చేసేదేమీ లేక గోడ దూకి లోపలికి వెళ్లి మరీ చిన్నారులు ఆటల సరదా తీర్చుకున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అనుసరించక తప్పలేదు. గోడలు దూకి లోపలికి వెళ్లే క్రమంలో కొందరు చిన్నారులు కిందపడి గాయాల పాలయ్యారు.

న్యూస్‌టుడే, కనిగిరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని