logo

కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి

న్యాయమూర్తులు కేసుల సత్వర పరిష్కారానికి కృషిచేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ సూచించారు.

Published : 26 Mar 2023 02:16 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌

జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ను సత్కరించి జ్ఞాపిక అందిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి, న్యాయమూర్తులు

ఒంగోలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: న్యాయమూర్తులు కేసుల సత్వర పరిష్కారానికి కృషిచేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ సూచించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల న్యాయమూర్తులతో శనివారం ఒంగోలులోని జిల్లా కోర్టులో ఆయన సమీక్షించారు. పెండింగు కేసుల వివరాలు తెలుసుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి, అదనపు జిల్లా జడ్జిలు ఆర్‌.శివకుమార్‌, ఎం.ఎ.సోమశేఖర్‌, డి.అమ్మన్నరాజా, టి.రాజావెంకటాద్రి, వివిధ న్యాయస్థానాల సీనియర్‌ సివిల్‌ జడ్జిలు, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ఎన్నెస్పీ అతిథి గృహానికి చేరుకున్న జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో పాటు జస్టిస్‌ కె.మన్మథరావులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌.వసుంధర స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని