logo

విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలకు దేహశుద్ధి

పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థినులను కొందరు ఆకతాయిలు వేధిస్తుండగా, బాలికల బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Published : 28 Mar 2024 02:07 IST

కనిగిరి, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థినులను కొందరు ఆకతాయిలు వేధిస్తుండగా, బాలికల బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కనిగిరి పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రంలో సోషల్‌ పరీక్ష రాసి బయటకు వచ్చిన బాలికల పట్ల ముగ్గురు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. ఇది గమనించిన  బాలికల బంధువులు వారికి దేహశుద్ధి చేసి పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. దీనిపై పోలీసులు విచారించి తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించి పంపారు. రెండోసారి ఇలాంటివి పునరావృతమైతే  పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని