logo

విద్యాభివృద్ధికే ప్రాధాన్యం

ఆమదాలవలస మండలం దన్నానపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో వెన్నెలవలస వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన పశుసంవర్థక పాలిటెక్నిక్‌ కళాశాల తాత్కాలిక తరగతి గదులను శాసన సభాపతి తమ్మినేని సీతారాం, పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బుధవారం ప్రారంభించారు

Published : 09 Dec 2021 06:21 IST

ఆమదాలవలస మండలం దన్నానపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో వెన్నెలవలస వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన పశుసంవర్థక పాలిటెక్నిక్‌ కళాశాల తాత్కాలిక తరగతి గదులను శాసన సభాపతి తమ్మినేని సీతారాం, పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నాడు-నేడు పనుల ద్వారా ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దారని తెలిపారు. ఎమ్మెల్యే విశ్వరాయి కళావతి, కళింగ కోమటి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్‌, కండాపు గోవిందరావు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయ డీన్‌ సర్జన్‌రెడ్డి, పశుసంవర్థక పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని