logo

ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

పలాస డిపో నుంచి అక్కుపల్లి, మెట్టూరు మీదగా అనకాపల్లి వరకు 22 మంది ప్రయాణికులతో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఎం.గడూరు సమీపంలో మలుపు వద్ద ఎదురుగా

Published : 09 Dec 2021 06:21 IST

అదుపుతప్పి విద్యుత్తు స్తంభానికి సమీపంలో ఆగిన బస్సు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: పలాస డిపో నుంచి అక్కుపల్లి, మెట్టూరు మీదగా అనకాపల్లి వరకు 22 మంది ప్రయాణికులతో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఎం.గడూరు సమీపంలో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిబోయి అదుపు తప్పింది. పక్కనే ఉన్న ఇసుక కూరుకుపోయి, 33/11 కేవీ విద్యుత్తు స్తంభానికి సమీపంలో ఆగింది. డ్రైవర్‌ డీఎన్‌ రావు అప్రమత్తంగా వ్యవహరించడంతో విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనకుండా బస్సు ఆగింది. లేకుంటే పెనుప్రమాదం జరిగేది. వెంటనే ప్రయాణికులు కిందకు దిగేశారు. కొద్ది రోజుల కిందట ఉద్దానం శుద్ధజల సరఫరా పైపు లైను కోసం రహదారి పక్కల గోతులు తవ్వారు. వాటిని సరిగా పూడ్చకపోవడంతో ఇసుకలో బస్సు దిగిపోయిందని, పిచ్చి మొక్కలు సైతం దట్టంగా పెరగడం ప్రమాదానికి కారణమైందని స్థానికులు అంటున్నారు. ఘటనపై విచారణ చేపడుతున్నట్లు డిపో మేనేజరు శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని