logo

లోపాల్లేకుండా సీఎం పర్యటనకు ఏర్పాట్లు

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. 27న సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం ఆయన

Published : 24 Jun 2022 03:18 IST

మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు, చిత్రంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, ఎసీˆ్ప రాధిక, తదితరులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. 27న సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మఒడి మూడో విడత నగదు పంపిణీ ప్రారంభ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రస్థాయి సమాచారం తెప్పించుకుని సిద్ధంగా ఉండాలన్నారు. విద్యార్థులను తీసుకువచ్చే క్రమంలో ఏయే బస్సుల్లో రావాలో వివరాలను ముందుగానే చూసుకోవాలన్నారు. తక్కువ వయసు ఉన్నవారిని తీసుకురావద్దని చెప్పారు.

వారికే అనుమతి: కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ మాట్లాడుతూ కోడిరామ్మూర్తి మైదానంలో వర్షం వస్తే నీరు నిలవకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సీఎం వచ్చినపుడు హెలీపాడ్‌ వద్దకు కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాత్రమే అనుమతిస్తామన్నారు. ఎస్పీ రాధిక మాట్లాడుతూ 80 అడుగుల రహదారి వద్ద, ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జేసీ ఎం.విజయసునీత, డీఆర్వో ఎం.రాజేశ్వరి, ఆర్డీవో శాంతి, డీఈవో జి.పగడాలమ్మ, ఏపీసీ ఆర్‌.జయప్రకాష్‌, డీఆర్‌డీఏ శాంతిశ్రీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఓబులేసు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని