logo

అర్ధరాత్రి వేళ మరబోటు బోల్తా

అర్ధరాత్రి.. దాదాపు 12 గంటల సమయం.. చిమ్మ చీకటి.. మరికొద్ది సేపట్లో ఒడ్డుకు చేరుకుంటామనుకుంటుండగా.. ఇంతలోనే రాకాసి అల విరుచుకుపడింది.

Published : 25 Nov 2022 03:04 IST

సురక్షితంగా ఒడ్డుకు చేరిన మత్స్యకారులు

ప్రమాదం నుంచి బయటపడింది వీరే..

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: అర్ధరాత్రి.. దాదాపు 12 గంటల సమయం.. చిమ్మ చీకటి.. మరికొద్ది సేపట్లో ఒడ్డుకు చేరుకుంటామనుకుంటుండగా.. ఇంతలోనే రాకాసి అల విరుచుకుపడింది. ఒక్కసారిగా బోటు బోల్తాపడటంతో అందులోని పది మంది మత్స్యకారులు సముద్రంలో చెల్లాచెదురుగా పడిపోయారు. అరుపులు, కేకలు.. ఎవరు ఎక్కడున్నారో అర్థం కాని పరిస్థితి. మొత్తానికి అందరూ ఈత కొడుతూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట తీరంలో జరిగిందీ ఘటన. బాధితులు తెలిపిన ప్రకారం.. మంచినీళ్లపేటకు చెందిన పరిమెల్ల చిన్నారావు, సోడిపల్లి బైరాగి, లండ గణపతి, దేవరాజు, ధనరాజు, రాజు, తాతారావులతో పాటు మరో ముగ్గురు బుధవారం సాయంత్రం సముద్రంలో వేటకు వెళ్లారు. తిరిగి ఉప్పుటేరు పొగురు ప్రాంతానికి వచ్చిన సమయంలో ఘటన చోటుచేసుకుంది. ఒడ్డుకు చేరుకున్న వెంటనే గ్రామానికి సమాచారం చేర వేశారు. జేసీబీ సాయంతో బోటును ఒడ్డుకు లాగారు. సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.

బోల్తా పడిన బోటు ఇదే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని