logo

చిలకపాలెం టోల్‌గేట్‌ ఎత్తివేతపై కార్మికుల ఆందోళన

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం పంచాయతీలోని 16వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్‌ను జాతీయ ప్రాధికార సంస్థ బుధవారం అర్ధరాత్రి  ఎత్తివేసింది.

Updated : 08 Dec 2022 12:19 IST

ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండలం చిలకపాలెం పరిధిలో 16వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్‌ను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) బుధవారం అర్ధరాత్రి  ఎత్తివేసింది. దీంతో  కార్మికులంతా గురువారం  ఆందోళన చేపట్టారు. టోల్‌గేట్‌ ఏర్పాటై 15 ఏళ్లు అవుతోందని.. అప్పటి నుంచి 106 మంది వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. టోల్ గేట్‌ ఎత్తివేయడంతో తామంతా వీధిన పడ్డామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. టోల్‌ గేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని