logo

సిక్కోలు గడ్డపై.. విశ్వనాథుడి అడుగులు..

ప్రసిద్ధ సినీ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత జిల్లావాసులందరిలో విషాదం నింపింది.   అపురూప చిత్రాలను అందించిన ఆయనకు శ్రీకాకుళంతో ఉన్న అనుబంధం విడదీయరానిది.

Published : 04 Feb 2023 04:12 IST

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే

నగరంలో ఓ వివాహ వేడుకలో కళా తపస్వి

ప్రసిద్ధ సినీ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత జిల్లావాసులందరిలో విషాదం నింపింది.   అపురూప చిత్రాలను అందించిన ఆయనకు శ్రీకాకుళంతో ఉన్న అనుబంధం విడదీయరానిది. పలుమార్లు శ్రీకాకుళం వచ్చి సిక్కోలు కళాకారులను సత్కరించి ఆశీర్వదించారు. 2007లో శ్రీకాకుళంలో జరిగిన సంగీత దర్శకుడు విద్యాసాగర్‌ కుమార్తె వివాహ వేడుకతో పాటు పలు శుభకార్యాలకు హాజరయ్యారు. 2010లో అరసవల్లిలో జరిగిన రథసప్తమి వేడుకల్లో పాల్గొని ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఓ సారి సినీనటుడు వంశీ ఇంటికి వచ్చారు.


పలువురి సంతాపం

అరసవల్లి ఆలయానికి వస్తున్న విశ్వనాథ్‌ (పాత చిత్రం)

జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు కె.విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి కలగాలని సంతాపం ప్రకటించారు. జిల్లాకు చెందిన ప్రసిద్ధ నర్తకి స్వాతి సోమనాథ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ రవీంద్రభారతిలో 1980లో నాట్యరంగంలో తన అరంగేట్రానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆశీర్వదించారని గుర్తుచేసుకున్నారు. స్వామి వివేకానంద జాతీయ అవార్డు గ్రహీత గురుగుబెల్లి లోకనాథం, ప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు వి.పి.శ్రీనివాస్‌, గాయకుడు పి.భారతీరమేశ్‌, ఉపనిషన్మందిరం అధ్యక్ష, కార్యదర్శులు గుమ్మానగేష్‌, వి.కామేశ్వరరావు, సభ్యుడు నిష్టల నరసింహమూర్తి, శ్రీకాకుళ రంగస్థల కళాకారులు సమాఖ్య ప్రతినిధులు, సంగీత దర్శకుడు బండారు చిట్టిబాబు, సుమిత్ర కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ, భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతరావు సంతాపం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని