logo

అధికారంలోకి రాగానే ‘నాడు-నేడు’పై విచారణ

అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు-నేడు కార్యక్రమంలో ఉపాధ్యాయులను బెదిరించి బిల్లులు తీసుకున్న నాయకులపైనా, నిర్మాణాలు చేయకుండా బిల్లులు పొందిన వారిపైనా సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

Published : 04 Feb 2023 04:12 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు, చిత్రంలో తెదేపా నేతలు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు-నేడు కార్యక్రమంలో ఉపాధ్యాయులను బెదిరించి బిల్లులు తీసుకున్న నాయకులపైనా, నిర్మాణాలు చేయకుండా బిల్లులు పొందిన వారిపైనా సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. చిన్నబమ్మిడి పంచాయతీ సుబ్బారావుపేట గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అచ్చెన్నాయుడు వద్ద ఏకరవు పెట్టారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అప్పనంగా ప్రభుత్వ సొమ్ము చెల్లించేందుకే ఆ పనులని, ప్రభుత్వం మారాక పిల్లలు పెరిగారని గొప్పగా చెప్పారని ఇప్పుడు వాస్తవాలు చెప్పగలరా? అని  ప్రశ్నించారు. విద్యా ప్రమాణాలు పెంచడమంటే పాఠశాలలు మూసివేయటం కాదని, ప్రతీ తరగతికి ఓ ఉపాధ్యాయుడిని నియమించి ఏటా డీఎస్సీ తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని