logo

జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలి

డీఎస్సీ 2002 బాధిత హిందీ పండితుల జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతరావు, శ్రీనివాసరావు కోరారు.

Updated : 21 Mar 2023 07:08 IST

ఖజానా శాఖ డీడీ రవికుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులు

కలెక్టరేట్(శ్రీకాకుళం),న్యూస్‌టుడే: డీఎస్సీ 2002 బాధిత హిందీ పండితుల జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతరావు, శ్రీనివాసరావు కోరారు. ఖజానా శాఖ డీడీ రవికుమార్‌ను సోమవారం కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 నెలల నుంచి అపరిష్కృతంగా ఉన్న జీతాల సమస్యకు పరిష్కారంగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను డీడీకి వివరించారు. ఇప్పటికే చాలా ఆలస్యమైనందున వెంటనే బిల్లులు పెట్టాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని