logo

పట్టాభిరామునికి ప్రియవందనం.. అయోధ్య రామునికి అభివందనం

శ్రీరామనవమి వేడుకలను బుధవారం  జిల్లావ్యాప్తంగా ప్రజలు వైభవంగా నిర్వహించారు.

Updated : 18 Apr 2024 06:39 IST

పాతశ్రీకాకుళం రామాలయంలో పూజల్లో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు  
శ్రీకాకుళం సాంస్కృతికం, గుజరాతీపేట(శ్రీకాకుళం), సారవకోట, న్యూస్‌టుడే: శ్రీరామనవమి వేడుకలను బుధవారం  జిల్లావ్యాప్తంగా ప్రజలు వైభవంగా నిర్వహించారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎక్కడ చూసినా రామనామ స్మరణ మారు మోగింది. ఉదయం నుంచే రామలయాల వద్ద బారులు తీరు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. పలుచోట్ల సీతారామ   కల్యాణోత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు, ఉత్సవ మూర్తుల ఊరేగింపులు జరిగాయి. కళాకారుల విచిత్ర వేషధారణలు, సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాత్రి వరకు రద్దీ కొనసాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని