logo

జెండా మారుతోంది..

లావేరు మండలం సహపురం పంచాయతీ హనుమంతపురం నుంచి వైకాపాకు చెందిన 50 కుటుంబాలు సోమవారం కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు సమక్షంలో కూటమిలో చేరాయి.

Published : 30 Apr 2024 05:34 IST

ఎన్నికల వేళ కూటమిలోకి జోరుగా చేరికలు

పార్టీలో చేరిన సహపురం గ్రామస్థులతో ఎచ్చెర్ల కూటమి అభ్యర్థి ఈశ్వరరావు

రణస్థలం, సరుబుజ్జిలి, ఆమదాలవలస పట్టణం, ఆమదాలవలస గ్రామీణం, వజ్రపుకొత్తూరు గ్రామీణం, న్యూస్‌టుడే: లావేరు మండలం సహపురం పంచాయతీ హనుమంతపురం నుంచి వైకాపాకు చెందిన 50 కుటుంబాలు సోమవారం కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు సమక్షంలో కూటమిలో చేరాయి. తెదేపా నాయకులు ముప్పిడి సురేష్‌, లంక ప్రభాకర్‌ పాల్గొన్నారు. బీ సరుబుజ్జిలి మండలంలోని మూలసవలాపురం గ్రామంలో వైకాపాను వీడి 30 కుటుంబాలు కూన రవికుమార్‌ ఆధ్వర్యంలో తెదేపాలో చేరాయి. మండల పార్టీ అధ్యక్షుడు అంబళ్ల రాంబాబు, తర్లాడ సురేంద్ర, భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి సూరపునాయుడు పాల్గొన్నారు. డకరవలస గ్రామంలో మాజీ సర్పంచి అడపాక అప్పలనాయుడు ఆధ్వర్యంలో 15 కుటుంబాలు తెదేపాలో చేరాయి. బీ ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని గాజులకొల్లివలసకు చెందిన సుమారు 30 కుటుంబాలు కూన రవికుమార్‌ ఆధ్వరంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. గోక ఉమారావు, కామిరెడ్డి రాము, కామిరెడ్డి కృష్ణా, చీపురు అప్పలరాజు, దుప్పపూడి ప్రభాకరరావు ఉన్నారు. బీ వజ్రపుకొత్తూరు మండలం కొండవూరులో కూటమి అభ్యర్థి గౌతు శిరీష సమక్షంలో వైకాపా సీనియర్‌ నాయకుడు, మాజీ సర్పంచి కొల్లి రమేష్‌తో పాటు 100 కుటుంబాలు తెదేపాలో చేరాయి.

తెదేపాలో చేరిన గాజులకొల్లివలస వాసులతో కూన రవికుమార్‌

వజ్రపుకొత్తూరు: శిరీషాకు గొర్రెపిల్ల, గొడుగు బహూకరించిన యాదవులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని