logo

రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం మాదిగలు, మాదిగ ఉప కులాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ఆర్‌జే ప్రకాష్‌ వెల్లడించారు.

Published : 30 Apr 2024 05:28 IST

ఐక్యత చాటుతున్న మాదిగ సంఘ నాయకులు

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం మాదిగలు, మాదిగ ఉప కులాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ఆర్‌జే ప్రకాష్‌ వెల్లడించారు. శ్రీకాకుళం నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రూ.25 వేల కోట్లు దారి మళ్లించి, షెడ్యూల్డ్‌ కులాల వారికి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైమాదిగ సేవా సంఘ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కొదమల బెంజెమిన్‌, మాదిగ దండోర వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పొన్నుగంటి రమేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని