logo

లెక్క తేలింది

సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గడువు పూర్తవ్వడంతో బరిలో నిలిచే రేసుగుర్రాల లెక్క తేలింది.

Published : 30 Apr 2024 05:49 IST

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)

టెక్కలి: గుర్తులు కేటాయిస్తున్న సబ్‌కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌

సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గడువు పూర్తవ్వడంతో బరిలో నిలిచే రేసుగుర్రాల లెక్క తేలింది. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 73 మంది, శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారికి అధికారులు నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించారు.


34 మంది తప్పుకొన్నారు..

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి 25 వరకు జరిగింది. 26న వాటిని పరిశీలించిన అధికారులు సోమవారం వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 107 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా.. 34 మంది వాటిని ఉపసంహరించుకున్నారు. 73 మంది పోటీలో నిలిచారు. అత్యధికంగా ఆమదాలవలస నియోజకవర్గం నుంచి 13 మంది అభ్యర్థులు ఎన్నికల్లో తలపడనున్నారు. నామినేషన్లు సైతం ఇక్కడి నుంచి ఎక్కువగా దాఖలయ్యాయి. టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల నుంచి ఏడుగురు చొప్పున బరిలో నిలిచారు. శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి 13 మంది నామపత్రాలు సమర్పించగా ఒక్కరు కూడా ఉపసంహరించుకోలేదు. అందరూ బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు వారి అదృష్టం పరీక్షించుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని