logo

రూ.29.5 లక్షల నగదు స్వాధీనం

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో సోమవారం భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. విశాఖపట్నం నుంచి మెళియాపుట్టికి ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.29.5 లక్షల నగదును శ్రీకాకుళం

Published : 30 Apr 2024 05:25 IST

ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు

అరసవల్లి, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో సోమవారం భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. విశాఖపట్నం నుంచి మెళియాపుట్టికి ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.29.5 లక్షల నగదును శ్రీకాకుళం నగరంలోని సింహద్వారం వద్ద ఎన్నికల నిఘా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దారు సీహెచ్‌ రాధాకృష్ణ ఆర్టీసీ బస్సులో సోదాలు నిర్వహిస్తుండగా.. విశాఖపట్నానికి చెందిన కదిలిండి వెంకటేశ్వరరాజు పండ్ల సంచిని పరిశీలించగా నగదు బయట పడింది. తాను మెళియాపుట్టిలో ఏకలవ్య పాఠశాల పనులు చేపడుతున్న గుత్తేదారుడినని ఆ పనులకు డబ్బులు అవసరం కాగా ఈనెల 24వ తేదీన విశాఖ ఇండియన్‌ బ్యాంక్‌లో నగదు ఉప సంహరించినట్లు సదరు గుత్తేదారు తనిఖీ అధికారులకు తెలియజేశారు. అధికారులు మళ్లీ ప్రశ్నించగా కూలీలకు డబ్బులు చెల్లించేందుకని చెప్పారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనాకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నగదు స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని