logo

నేటి నుంచి నామపత్రాల స్వీకరణ

సార్వత్రిక ఎన్నికల తొలి ఘట్టానికి తెరలేస్తోంది.. నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా పరిధిలో పార్లమెంట్‌ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Updated : 18 Apr 2024 06:48 IST

పార్లమెంట్‌, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికారుల విస్తృత ఏర్పాట్లు

న్యూస్‌టుడే, కలెక్టరేట్‌ (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల తొలి ఘట్టానికి తెరలేస్తోంది.. నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా పరిధిలో పార్లమెంట్‌ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మరోవైపు  అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. నామపత్రాల ఘట్టంలోనే తమ బలనిరూపణ చేపట్టేలా  అభ్యర్థులు ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇప్పటికే ముహూర్తాలు ఖరారు చేసుకుని పార్టీ శ్రేణులకు సమాచారమిచ్చారు. ఇప్పటి వరకు అన్ని నియోజకవర్గాల్లో స్తబ్దుగా నడుస్తున్న ప్రచారాలు ఊపందుకోనున్నాయి. శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ వ్యవహరించనున్నారు.

ఇవి గుర్తుంచుకోండి..

  •  అసెంబ్లీ అభ్యర్థి నియోజకవర్గ పరిధిలో, పార్లమెంట్‌ అభ్యర్థి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో నామపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
  • నిబంధనల ప్రకారం అధికారిక సెలవు రోజుల్లో మిగిలిన అన్ని రోజుల్లోనూ నామపత్రాలను స్వీకరిస్తారు.
  •  ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే తీసుకుంటారు.  
  •  ఈ ప్రక్రియ పూర్తిగా నిఘానీడన ఉంటుంది. రిటర్నింగ్‌ అధికారి గదిలో సీసీ కెమెరాలు ఉంటాయి. వీడియోగ్రఫీ చేస్తారు.
  •  కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలో మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని