logo

ఆటోలో మంత్రి ప్రయాణం

రాష్ట్ర మంత్రి మస్తాన్‌ ఓ ఆటోలో డ్రైవర్‌ పక్కన కూర్చుని ప్రయాణించిన వీడియో వైరల్‌ అయింది. ఈ నేపథ్యంలో ఆయన మోటారు వాహన చట్టం నియమాలను ఉల్లంఘించారని విమర్శలు వచ్చాయి. విల్లుపురం జిల్లా ఆనందపురం సమీపంలోని పుదుపేటలో డీఎంకే నిర్వాహకుడు వెంకటేశన్‌ అనారోగ్యంతో ఇంట్లో ఉన్నట్లు మంత్రి మస్తాన్‌ తెలుసుకున్నారు.

Published : 25 May 2022 01:29 IST

ఆటోలో డ్రైవర్‌ పక్కన కూర్చొని ప్రయాణిస్తున్న మంత్రి మస్తాన్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రి మస్తాన్‌ ఓ ఆటోలో డ్రైవర్‌ పక్కన కూర్చుని ప్రయాణించిన వీడియో వైరల్‌ అయింది. ఈ నేపథ్యంలో ఆయన మోటారు వాహన చట్టం నియమాలను ఉల్లంఘించారని విమర్శలు వచ్చాయి. విల్లుపురం జిల్లా ఆనందపురం సమీపంలోని పుదుపేటలో డీఎంకే నిర్వాహకుడు వెంకటేశన్‌ అనారోగ్యంతో ఇంట్లో ఉన్నట్లు మంత్రి మస్తాన్‌ తెలుసుకున్నారు. మంగళవారం కారులో ఆనందపురం వరకు వెళ్లారు. అక్కడి నుంచి వెంకటేశన్‌ ఇంటికి వెళ్లే మార్గంలో కారు వెళ్లలేని పరిస్థితి. ఓ ఆటోలో డ్రైవర్‌ పక్కన మంత్రి, వెనుక సీటులో డీఎంకే నేతలు, సెక్యూరిటీ గార్డులు కూర్చుని వెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని