logo

ఆ ఖైదీల విడుదలకు చర్యలు

శిక్షాకాలం ముగిసిన ఖైదీలను విడిపించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లఫె్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. పుదుచ్చేరి కాలాపట్టిలోని కేంద్ర కారాగారంలో ఖైదీలు నిర్వహిస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని తమిళిసై మంగళవారం సందర్శించారు.

Published : 25 May 2022 01:29 IST

పుదువై ఇన్‌ఛార్జి ఎల్జీ

పంటను పరిశీలిస్తున్న తమిళిసై

చెన్నై, న్యూస్‌టుడే: శిక్షాకాలం ముగిసిన ఖైదీలను విడిపించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లఫె్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. పుదుచ్చేరి కాలాపట్టిలోని కేంద్ర కారాగారంలో ఖైదీలు నిర్వహిస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని తమిళిసై మంగళవారం సందర్శించారు. ఆమెను జైళ్లశాఖ ఐజీ రవిదీప్‌ సింగ్‌ సాగర్‌ స్వాగతించారు. ఖైదీల మానసిక ఒత్తిడిని పోగొట్టేందుకు, వారిని సచ్ఛీలురుగా చేసేందుకు చేపడుతున్న చర్యలను వివరించారు. జైలుశాఖ అధికారుల ప్రయత్నాలను తమిళిసై అభినందించారు. సంప్రదాయ విధానంలో సేంద్రియ ఎరువులు ఉపయోగించి కూరగాయలు, పండ్లు వంటి రకాలు సాగు చేయడం గురించి తెలుసుకున్నారు. ఖైదీలను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా జైలు ప్రాంగణంలో మొక్కలు నాటారు. వసతుల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ... ఖైదీలు సాగుచేసిన వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి రైతు బజారులో చోటు కల్పించడానికి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. శిక్షాకాలం ముగిసిన ఖైదీలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. కారైకాల్‌ జైలును నిర్మించడానికి రెండేళ్లు అవుతుందని, అప్పటివరకు ఖైదీలను పుదుచ్చేరి జైలులో సురక్షితంగా ఉంచుతారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని