logo

ఆలయాల జీర్ణోద్ధరణకు నిధులు

రాష్ట్రంలో ఆదిద్రావిడ, గిరిజన నివాస ప్రాంతాల్లోని ఆలయాల జీర్ణోద్ధరణ నిధులను రూ.2 లక్షలకు పెంచామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. చెన్నై నుంగంబాక్కంలో ఉన్న దేవాదాయ శాఖ కమిషనరు కార్యాలయంలో మంగళవారం

Published : 18 Aug 2022 00:44 IST

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పీకే శేఖర్‌ బాబు

వేలచ్చేరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆదిద్రావిడ, గిరిజన నివాస ప్రాంతాల్లోని ఆలయాల జీర్ణోద్ధరణ నిధులను రూ.2 లక్షలకు పెంచామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. చెన్నై నుంగంబాక్కంలో ఉన్న దేవాదాయ శాఖ కమిషనరు కార్యాలయంలో మంగళవారం రాత్రి మంత్రి నేతృత్వంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో దేవాదాయ శాఖ పద్దుల కింద చేపట్టాల్సిన పథకాలు, నిల్వలో ఉన్న పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ చరిత్రలో అసెంబ్లీలో ప్రకటించిన పథ]కాల అమలు గురించి ఎక్కువగా సమీక్షా సమావేశాలను నిర్వహించిన ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు. అనేక కోర్టు కేసులను ఎదుర్కొంటున్నామని, న్యాయమైన తీర్పులను పొందుతున్నామని తెలిపారు. ఆలయాల్లో భక్తులకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గత శనివారం కొలత్తూర్‌ పరిధిలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ చేపడుతున్న పనులు, అమలు చేస్తున్న పథకాల తీరు బాగుందని కితాబిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆదిద్రావిడులు, గిరిజనులు నివాస ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో జీర్ణోద్ధరణ చేపట్టడానికి నిధులను రూ.2 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు.  ఈ ఆలయాల సంఖ్య సంవత్సరంలో 2,500కు పెరిగిందని తెలిపారు. ఆయా ఆలయాల ప్రతినిధులకు సంబంధిత మొత్తానికి చెందిన చెక్కులు అందజేసే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనరు జే.కుమరగురుబరన్‌, అడిషనల్‌  కమిషనర్లు ఆర్‌ కన్నన్‌, ఎన్‌.తిరుమగళ్‌, సి.హరిప్రియ, జాయింటు  కమిషనర్లు,  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని