logo

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కంచి పట్టుచీర సిద్ధం

తిరుమలలో జరగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి కానుకగా  అందజేయడానికి ఓ భక్తుడు స్వామివారి రూపంతో పట్టు చీరను తయారు చేయించారు. చెన్నైకు చెందిన ఓ భక్తుడు బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి కానుకుగా

Published : 29 Sep 2022 02:23 IST

చీర కొంగుపై శ్రీరంగనాథుడి డిజైన్‌

కాంచీపురం, న్యూస్‌టుడే: తిరుమలలో జరగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి కానుకగా  అందజేయడానికి ఓ భక్తుడు స్వామివారి రూపంతో పట్టు చీరను తయారు చేయించారు. చెన్నైకు చెందిన ఓ భక్తుడు బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి కానుకుగా అందజేయడానికి కాంచీపురంలో ప్రత్యేకంగా పట్టు చీరను తయారు చేయించారు. 21.50 మూరల పొడవు, 50 ఇంచుల వెడల్పుతో ఈ చీరను రూపొందించారు. దానిపై శ్రీవారి రూపాలతోపాటు, శ్రీరంగనాథస్వామి శేషశయనంపై ఉన్నట్లు కొంగుపై డిజైన్‌ చేశారు. 1.3 కిలోల బరువుతో కాంచీపురానికి చెందిన కుమరవేల్‌ వారం రోజుల్లో తయారు చేశారు.

పట్టు చీరపై వేంకటేశ్వరుని రూపం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని