logo

నాయన్మారుల సన్నిధికి మహా కుంభాభిషేకం

వేలూర్‌ సమీపం సత్తువాచ్చారిలో పురాతనమైన పర్వతవర్ధిని సమేత కైలాసనాథర్‌ ఆలయం ప్రాంగణంలో ఉన్న వినాయకుడు, 63 నాయన్మారుల సన్నిధులకు శుక్రవారం మహా కుంభాభిషేకాన్ని నిర్వహించారు.

Published : 28 Jan 2023 01:05 IST

గోపుర కలశాలపై పుణ్య జలాలు పోస్తున్న దృశ్యం

వేలూర్‌, న్యూస్‌టుడే: వేలూర్‌ సమీపం సత్తువాచ్చారిలో పురాతనమైన పర్వతవర్ధిని సమేత కైలాసనాథర్‌ ఆలయం ప్రాంగణంలో ఉన్న వినాయకుడు, 63 నాయన్మారుల సన్నిధులకు శుక్రవారం మహా కుంభాభిషేకాన్ని నిర్వహించారు. వివిధ నదుల నుంచి తీసుకువచ్చిన పుణ్య జలాలను యాగశాలలో ఉంచి అర్చకులు పూజలు చేశారు. అనంతరం  పుణ్య జలాలున్న కలశాలను శుక్రవారం ఊరేగింపుగా తీసుకువెళ్లి సన్నిధులపై ఉన్న కలశాలపై అభిషేకించారు. ఉత్సవాల్లో రత్నగిరి బాలమురుగన్‌ అడిమై స్వామి, లోకనాథ స్వామి, భక్తులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని