logo

జలవనరుల పునరుద్ధరణ

పూండి, కన్నన్‌కోట్టై చెరువులు చెన్నైవాసుల తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. వేసవిలో పూండి చెరువు ఎండిపోతుండటంతో చెన్నైలో నీటి ఎద్దడి ఏర్పడుతోంది.

Updated : 05 Jun 2023 05:12 IST

ఊత్తుకోట, న్యూస్‌టుడే: పూండి, కన్నన్‌కోట్టై చెరువులు చెన్నైవాసుల తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. వేసవిలో పూండి చెరువు ఎండిపోతుండటంతో చెన్నైలో నీటి ఎద్దడి ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పూండి చెరువు ఎత్తును పెంచి నిల్వ సామర్థ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చెన్నై జలమండలి అదనపు ప్రధాన కార్యదర్శి శివదాస్‌మీనా నేతృత్వంలో అధికారుల బృందం పూండి, కన్నన్‌కోట్టై చెరువులను ఆదివారం పరిశీలించింది. జిల్లా కలెక్టరు ఆల్ఫిజాన్‌వర్గీస్‌ తదితరులు వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని