logo

అల్పాహార పథకం ఎలా అమలువుతోంది?

తమిళనాట అమలవుతున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్ర అధికారులు చెన్నై వచ్చారు.

Published : 01 Sep 2023 00:24 IST

పరిశీలించిన తెలంగాణ అధికారులు

పథకం వివరాలు తెలియజేస్తున్న సమన్వయ అధికారి

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: తమిళనాట అమలవుతున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్ర అధికారులు చెన్నై వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్‌, ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిష్టినాచొంగ్తు, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ముఖ్యమంత్రి పేషీ అధికారిణి ప్రియాంక వర్ఘీస్‌, మహిళలు, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్లశాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హొలికేరి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గురువారం రాయపురంలోని వంటశాలలో ఆహారం తయారీ, కావాల్సిన వస్తువుల కొనుగోలు, పాఠశాలలకు తరలింపు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆహారం రుచి చూశారు. అనంతరం రాయపురం ఆరత్తూన్‌ రోడ్డులోని కార్పొరేషన్‌ ఉర్దు పాఠశాలలో విద్యార్థులకు ఆహారం అందించడాన్ని పరిశీలించారు. రోజుకు ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు, తల్లిదండ్రులు స్పందనను ఉపాధ్యాయుల వద్ద అడిగి తెలుసుకున్నారు. పథకం సమన్వయ అధికారి ఇళమ్‌భగవత్‌ వారికి అన్ని వివరాలు తెలియజేశారు. విద్యార్థులు పాఠశాలకు అల్పాహారం తినకుండా వస్తున్నందున చదువులో ఆటంకాలు ఎదురవుతున్నాయని, తరగతులు మానేస్తున్నారని ఇక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఆ సమస్యలకు పరిష్కారంగా అల్పాహార పథకం ప్రవేశపెట్టింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలలకు పథకాన్ని విస్తరింపజేశారు. ఈ పథకం ద్వారా తమిళనాడులో సుమారు 17 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు