logo

ఆసుపత్రిలో చేరిన ఈరోడ్‌ ఎంపీ.. ఆత్మహత్యాయత్నమంటూ వదంతులు

ఈరోడ్‌ ఎంపీ గణేశమూర్తి ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంతో కోవైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు వార్తలు రావడంతో ఎండీఎంకేలో ఉద్రిక్తత నెలకొంది.

Updated : 25 Mar 2024 09:43 IST

ఆస్పత్రి వద్ద గణేశమూర్తి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈరోడ్‌ ఎంపీ గణేశమూర్తి ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంతో కోవైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు వార్తలు రావడంతో ఎండీఎంకేలో ఉద్రిక్తత నెలకొంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు ఈరోడ్‌ స్థానం కేటాయించగా గణేశమూర్తి ఉదయించే సూర్యుడి గుర్తుపై గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎండీఎంకేకు తిరుచ్చి కేటాయించగా దురైవైగోను అభ్యర్థిగా ప్రకటించారు. గణేశమూర్తికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. వారంరోజులుగా ఆయన మనోవేదనకు గురైౖనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఈరోడ్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం కోవైలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పార్టీలో సమస్యల కారణంగా గణేశమూర్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని ఆయన బంధువులు, పార్టీ వర్గీయులు నిర్ధారించలేదు. 1993లో ఎండీఎంకే ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న గణేశమూర్తి 2016 నుంచి పార్టీ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని