logo

5 రోజులే.. సమయం!!

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి అనుగుణంగా ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా తక్షణమే బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీలకు సమర్పించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా

Published : 21 Jan 2022 04:28 IST

అయినా.. బిల్లులు సిద్ధం చేయాలని ఆర్థికశాఖ ఆదేశాలు
కొత్త పీఆర్సీకి అనుగుణంగా వేతనాలపై కసరత్తు
న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి అనుగుణంగా ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా తక్షణమే బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీలకు సమర్పించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఖజానా అధికారులకు గురువారం సమాచారం వచ్చింది. వీరి నుంచి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన డీడీఓలకు మార్గదర్శకాలు వెళ్లనున్నాయి.

* సాధారణంగా ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రతి నెలా 27వ తేదీలోపు  ట్రెజరీ, సబ్‌ ట్రెజరీ కార్యాలయాలకు  డీడీఓలు నివేదిస్తారు. ఈ మేరకు బిల్లులు సమర్పించేందుకు కేవలం ఏడు రోజులు మాత్రమే గడువుంది. అందులో రెండు రోజులు సెలవులు వచ్చాయి. అంటే కేవలం అయిదు రోజులు మాత్రమే సమయం ఉంది. పీఆర్సీకి అనుగుణంగా వేతన స్థిరీకరణ చేసి జీతాల బిల్లులు సిద్ధం చేయాలంటే కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుందని ఓ డీడీఓ తెలిపారు. పైగా వేతన స్థిరీకరణ సమయంలో ఉద్యోగుల సంబంధించి ఇంత వరకు నూతన మార్గదర్శకాలు రాలేదని సదరు అధికారి పేర్కొన్నారు.

* మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ తరుణంలో హడావుడిగా వేతన స్థిరీకరణ చేసి బిల్లులు అందజేయాలంటే తమ వల్ల కాదని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుత నెలలో స్థిరీకరణకు అనుగుణంగా బిల్లులు సమర్పించని వారికి ఫిబ్రవరి నెల జీతాలు నిలిపివేయాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు జిల్లా ఖజానా అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని